ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా గంధోత్సవం

ABN, First Publish Date - 2021-06-24T04:52:25+05:30

కౌతాళంలో వెలసిన జగద్గురు ఖాదర్‌లింగ స్వామి 317వ ఉరు సు వేడుకల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన గంధోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.

ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారి సమాధిని దర్శించుకుంటున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రత్యేక పాతేహాలు నిర్వహించిన భక్తులు

నేడు ఖాదర్‌లింగ స్వామి ఉరుసు

కౌతాళం, జూన్‌ 23: కౌతాళంలో వెలసిన జగద్గురు ఖాదర్‌లింగ స్వామి 317వ ఉరు సు వేడుకల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన గంధోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు విశేష కార్యక్రమాలను చేపట్టారు. ఉత్సవాల్లో విశేష రోజు సందర్భంగా దాదాపు 60 అడుగుల జెండాను ప్రత్యేకంగా అలంకరించారు. దర్గా వీధుల్లో ఊరేగిస్తూ అర్ధ రాత్రి దాటిన తరువాత ఒంటి గంటకు దర్గా కట్టపైగల చెట్టుపై ఆవిష్కరించారు. తెల్లవారుజామున దర్గా ధర్మకర్త హజరత్‌ ఖ్వాజా సయ్యద్‌ సాహెబ్‌ పీర్‌ చిష్తి ఆధ్వర్యంలో వంశస్తులు తమ స్వగృహం నుంచి వెండి పాత్రల్లో గంధాన్ని తీసుకువ చ్చారు. వాయిద్యాలు, ఫక్కీరుల విన్యాసాల నడుమ గంధం దర్గాకు చేరుకుంది. అనంతరం స్వామివారి సమాధితోపాటు వారి వం శస్తుల సమాధులపై గంధాన్ని పూసి నూతన వస్త్రాలు, పూలు, అత్తర్లతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా దర్గా గుమ్మజ్‌, బులంద్‌ దర్వాజాలతోపాటు వీధులను విద్యుద్దీపాలతో అలంకరించారు. గుమ్మజ్‌ లోపల గాజు పలకలతో నిర్మించిన దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దర్గా వంశస్తులు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామి వారికి ప్రత్యేక పాతేహాలు నిర్వహించారు. ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ వంటి వివిధ పాంత్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది.


Updated Date - 2021-06-24T04:52:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising