ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘దారి మళ్లించిన సర్పంచ్‌ల నిధులు ఇవ్వాలి’

ABN, First Publish Date - 2021-12-03T05:25:55+05:30

రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన సర్నంచ్‌ నిధులను తక్షణమే విడుదల చేయాలని నందికొటూరు తెలుగుదేశం నాయకులు, సర్పంచులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఎంపీడీవోకు వినతి పత్రం ఇస్తున్న సర్పంచులు, టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందికొట్కూరు రూరల్‌, డిసెంబరు 2: రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన సర్నంచ్‌ నిధులను తక్షణమే విడుదల చేయాలని నందికొటూరు తెలుగుదేశం నాయకులు, సర్పంచులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎంపీడీవో సుబ్రమణ్యశర్మకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచులు దామోదరరెడ్డి, నాగలక్ష్మయ్య, రామచంద్రుడులు మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం సర్పంచ్‌ నిధులను విద్యుత్‌ బకాయిలకు జమ చేసుకున్నామని ఆర్థిక మంత్రి తెలుపడం దారుణమని అన్నారు. కేంద్రం గ్రామాలకు ఇచ్చిన నిధులను రాష్ట్రం వాడుకునే దౌర్భాగ్యాన్ని ఎన్నడూ చూడలేదని అన్నారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఆదాయంలేని మైనర్‌ గ్రామ పంచాయతీలకు అప్పటి ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 1984 నుంచి ఉచిత కరెంటు ఇచ్చారన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గ్రామాల నిధులను తక్షణమే ఇవ్వాలన్నారు.  తెలుగుదేశం పార్టీ నాయకులు మహేశ్వరెడ్డి, జయసూర్య, వేణు, ముర్తుజావలి పాల్గొన్నారు.

Updated Date - 2021-12-03T05:25:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising