ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యాన పంటలపై దృష్టి సారించండి

ABN, First Publish Date - 2021-12-31T05:36:33+05:30

మండలంలోని గ్రామాల్లో ఉద్యానవన పంటల సాగుపై మరింత దృష్టి సారించాలని ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స అడిషనల్‌ పీడీ బాలకృష్ణారెడ్డి, జిల్లా విజిలెన్స్‌ అధికారి సిద్ధ్దలింగమూర్తి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. సామాజిక తనిఖీ బహిరంగ సభలో ఏపీడీ


శిరివెళ్ల, డిసెంబరు 30: మండలంలోని గ్రామాల్లో ఉద్యానవన పంటల సాగుపై మరింత దృష్టి సారించాలని ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స అడిషనల్‌ పీడీ బాలకృష్ణారెడ్డి,  జిల్లా విజిలెన్స్‌ అధికారి సిద్ధ్దలింగమూర్తి అన్నారు. 2019-20, 2020-21 సంవత్సరాల్లో మండలంలో జరిగిన పనులపై సామాజిక తనిఖీ బృందం గ్రామస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో గురువారం నిర్వహించిన సామాజిక తనిఖీ బహిరంగ సమావేశంలో తనిఖీ బృందం సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వివిధ శాఖల్లో దాదాపు రూ.20 లక్షలకు సం బంధించిన అవకతవకలను గుర్తించినట్లు వారు వివరించారు. ఇందులో ఉపాధి హామీ పనులకు గాను రూ.32 వేలు, పూర్తి చేసిన పనులు సూచించే బోర్డులను ఏర్పాటు చేయనందుకు రూ.3.6 లక్షలు, ఐకేపీ ఆధ్వర్యంలో నాటిన మొక్కలను క్షేత్రస్థాయిలో పరిశీలించగా పురోగతి లేకపోవండతో రూ.4 లక్షలు, పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో సచివాలయాల నిర్మాణాలకు తీసుకున్న మెటీరియల్‌ వినియోగంలో జరిగిన లోపాలకు రూ.5 లక్షలు, మినీ గోకులాల నిర్మాణాలకు సంబంధించి సరైన బిల్లులు చూపకపోవడంతో రూ.5లక్షలు రికవరీకి ఆదేశించారు. ఉపాధి పనుల మస్టర్లలో దిద్దుబాట్లు, అధికారుల నిర్లక్ష్యానికి రూ. 35 వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, ఈవోపీఆర్డీ సాల్మన్‌, వాటర్‌షెడ్‌ అడిషనల్‌ పీడీ సలీం బాషా, ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స అసిస్టెంట్‌ పీడీ బాలాజీ నాయక్‌, శిరివెళ్ల ఏపీవో విజయ్‌ మోహన్‌, ఈసీ సుబ్బరాయుడు, క్షేత్రసహాయకులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-12-31T05:36:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising