ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్చి నుంచి కర్నూలుకు విమాన సర్వీసులు

ABN, First Publish Date - 2021-01-17T05:45:50+05:30

కర్నూలు విమానాశ్రయంలో వాణిజ్య విమానాల రాకపోకలకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) అనుమతి లభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. ఎయిర్‌పోర్టుకు డీజీసీఏ అనుమతి


కర్నూలు(అర్బన్‌), జనవరి 16: కర్నూలు విమానాశ్రయంలో వాణిజ్య విమానాల రాకపోకలకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) అనుమతి లభించింది. మార్చి నుంచి జిల్లాకు విమాన రాకపోకలు ప్రారంభం అవుతాయి. విమానాశ్రయ పనులు వేగవంతం చేయాలని గతేడాది కేంద్ర పౌర విమానయాన శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఓర్వకల్లు విమానాశ్రయంలో పనులు పూర్తి కావడంతో అక్టోబరు 9న డిల్లీ డీజీఏసీ అధికారుల బృందం విమానాశ్రయాన్ని తనిఖీ చేసింది. మౌలిక వసతులు, ఇతర పనులను కలెక్టర్‌ వీరపాండియన్‌, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో కలిసి ఏబీపీఎల్‌ ఎండీ వీఎన్‌ భరత్‌ రెడ్డి పరిశీలించి వెళ్లారు. ఏపీ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పిచడంతో డీజీసీఏ విమాన రాకపోకలకు పచ్చ జెండా ఊపింది. ఎయిర్‌క్రాఫ్టు రూల్స్‌ 1937, ఎయిర్‌ క్రాప్టు యాక్టు 1934 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పరిధిలోని కర్నూలు ఎయిర్‌పోర్టుకు అనుమతులు మంజూరు చేశారు.

Updated Date - 2021-01-17T05:45:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising