ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రథమస్థానంలో తెలంగాణ ఎద్దులు

ABN, First Publish Date - 2021-04-17T04:51:06+05:30

మండలంలోని వెంకటగిరిలో ఉగాది పండుగ సందర్భంగా నిర్వహించిన ఎద్దుల బల ప్రదర్శన పోటీల్లో తెలంగాణ ఎద్దులు ప్రథమ స్థానంలో నిలిచాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కోడుమూరు(రూరల్‌), ఏప్రిల్‌ 16: మండలంలోని వెంకటగిరిలో ఉగాది పండుగ సందర్భంగా నిర్వహించిన ఎద్దుల బల ప్రదర్శన పోటీల్లో తెలంగాణ ఎద్దులు ప్రథమ స్థానంలో నిలిచాయి. గురువారం రెండు పళ్ల ఎద్దుల పోటీ జరిపించగా, శుక్రవారం ఆరు పళ్ల ఎద్దుల బండలాగు పోటీ చేపట్టారు. పోటీలో తొమ్మిది జతల ఎద్దులు పాల్గొన్నాయి. బండలాగు పోటీని లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయ చైర్మన్‌ ఎద్దుల మహేశ్వరరెడ్డి ప్రారంభించారు. జోగులాంబ గద్వాల జిల్లా గుర్రంగడ్డ శంకర్‌ ఎద్దులు అత్యధికంగా 3,300 అడుగుల దూరం లాగి రూ.40 వేలు గెలుచుకున్నాయి. రెండో స్థానంలో నంద్యాల ఈశ్వర్‌సాకేత్‌రెడ్డి ఎద్దులు 2,730 అడుగులతో రూ.30 వేలు పొందాయి. వడ్డెమాన్‌ రామానాయుడు ఎద్దులు రూ.20 వేలు, గుత్తి శాంతిప్రియారెడ్డి ఎద్దులు రూ.10 వేలు, ఇనగండ్ల తలారి దుబ్బన్న ఎద్దులు రూ.5 వేలు తర్వాతి స్థానాల్లో గెలుపొందాయి. వ్యాఖ్యాతలుగా వేమారెడ్డి, శ్రీనివాసులు, మిమిక్రీ ఉస్మాన్‌బాషా వ్యవహరించారు. కార్యక్రమంలో వేణుగోపాల్‌రెడ్డి, వెంకటక్రిష్ణారెడ్డి, గిరిప్రకాష్‌రెడ్డి, మహేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-17T04:51:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising