ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొలంలో పోరాటం

ABN, First Publish Date - 2021-06-14T05:52:33+05:30

ఆరంభంలోనే మేఘం కరుణించింది. కుండపోత వర్షం పొలాన్ని నిలువునా తడిపేసింది. మట్టి మనిషి మురిసిపోయాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. పశ్చిమ ప్రాంతంలో వర్షం లేక వాడిపోతున్న పత్తి మొలకలు


ఆరంభంలోనే మేఘం కరుణించింది. కుండపోత వర్షం పొలాన్ని నిలువునా తడిపేసింది. మట్టి మనిషి మురిసిపోయాడు. కోటి ఆశలతో పత్తి విత్తనాలు నాటాడు. షరా మామూలే..! మేఘం ముఖం చాటేసింది. మండే ఎండలకు మొలకలు వాడిపోతున్నాయి. వాటి ప్రాణం నిలిపేందుకు బిందెలు, బకెట్లతో నీరు తెచ్చి ఇలా ఒక్కో మొలకను తడుపుతున్నాడు. ఆలూరు నియోజకవర్గ పరిధిలోని బిలేహాల్‌ గ్రామానికి చెందిన శేషగిరి అనే రైతు కుటుంబం తమ పొలంలో ఆదివారం ఇలా శ్రమిస్తూ కనిపించింది. అరికెర, బిలేహల్‌, కరడిగూడ్డం, హులేబీడు, నెరణికి తదితర గ్రామాల్లో పత్తి విత్తనం వేసిన రైతులందరిదీ ఇదే పరిస్థితి. వర్షం కోసం ఎదురు చూస్తూ.. పంటను కాపాడే పోరాటాన్ని ఈ ఏడాది కూడా మొదలు పెట్టారు.

- ఆలూరు రూరల్‌

Updated Date - 2021-06-14T05:52:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising