ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘విశాఖ ఉక్కు కోసం పోరాటం’

ABN, First Publish Date - 2021-10-30T04:58:47+05:30

విశాఖ ఉక్కు కోసం పోరాటాలకు సిద్ధం కావాలని, నవంబరు 1న జరిగే విద్యార్థి, యువత ర్యాలీని జయప్రదం చేయాలని డీవైఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి డి.ఉసేన్‌బాషా, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు ఎ.నిరంజన్‌ కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల టౌన్‌, అక్టోబరు 29: విశాఖ ఉక్కు కోసం పోరాటాలకు సిద్ధం కావాలని, నవంబరు 1న జరిగే విద్యార్థి, యువత ర్యాలీని జయప్రదం చేయాలని డీవైఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి డి.ఉసేన్‌బాషా, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు ఎ.నిరంజన్‌ కోరారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఏపీకి ఆదాయం, ఉపాధి వనరుగా ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేట్‌ పరం చేయడానికి ప్రధాని మోదీకి మనసెలా వచ్చిందో అర్థం కావడంలేదని అన్నారు. భవిష్యత్‌లో వచ్చే తరాలకు ఉద్యోగాల్లేకుండా పోతాయని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా బడా పెట్టుబడిదారులకు, ప్రైవేట్‌ సంస్థలకు అప్పజెపుతుండటం దారుణమన్నారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 32మంది ప్రాణాలు కోల్పోయి విశాఖ ఉక్కు పరిశ్రమను సాధించారని, నవంబరు 1వ తేదీకి 50సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువతతో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. డీవైఎ్‌ఫఐ, ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు శివ, లక్ష్మణ్‌, రమణ, తేజ పాల్గొన్నారు.



Updated Date - 2021-10-30T04:58:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising