ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నదాత ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-01-19T06:00:38+05:30

మండలంలోని గుడిపాడు గ్రామంలో అప్పుల బాధతో రైతు మద్దిలేటి (51) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. కలిసిరాని వ్యవసాయం
  2. రూ.7 లక్షలు దాటిన అప్పు 


ప్యాపిలి, జనవరి 18: మండలంలోని గుడిపాడు గ్రామంలో అప్పుల బాధతో రైతు మద్దిలేటి (51) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మద్దిలేటికి 5 ఎకరాల పొలం ఉంది. మూడేళ్లుగా వేరుశనగ, టమోటా, ఆముదం వంటి పంటలు సాగు చేశాడు. పెట్టుబడి కోసం బ్యాంకుల్లో, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.5 లక్షలకు పైగా అప్పు చేశాడు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిన్నాయి. చిల్లిగవ్వ కూడా మిగలడం లేదు. ఎలాగైనా గట్టెక్కుదామని మరో రూ.2 లక్షలు అప్పు చేసి గత ఏడాది మూడు బోర్లు వేయించాడు. గంగమ్మ కరుణించ లేదు. దీంతో మొత్తం అప్పులు రూ.7 లక్షలు దాటాయి. అప్పులు ఇచ్చిన వారికి సమాధానం చెప్పలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరులేని సమయంలోఆదివారం సాయంత్రం పురుగుల మందు తాగాడు. అపస్మారకస్థితిలో ఉన్న రైతును గుర్తించిన కుటుంబ సభ్యులు స్థానిక వైద్యుల సలహా మేరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు జలదుర్గం పోలీసులు తెలిపారు.  భార్య లక్ష్మిదేవి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ శ్రీధర్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-01-19T06:00:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising