ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బీసీపై అసత్య ఆరోపణలు తగదు’

ABN, First Publish Date - 2021-09-19T04:17:48+05:30

మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డిపై వైసీపీకి చెందిన డాక్టర్‌ మహమ్మద్‌ తప్పుడు, అసత్య ఆరోపణలు చేస్తున్నారని జిల్లా మైనార్టీ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్‌ మహమ్మద్‌, ఉపసర్పంచ బురానుద్దీన తీవ్రంగా విమర్శించారు.

మాట్లాడుతున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బనగానపల్లె, సెప్టెంబరు 18: మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డిపై వైసీపీకి చెందిన డాక్టర్‌ మహమ్మద్‌ తప్పుడు, అసత్య ఆరోపణలు చేస్తున్నారని జిల్లా మైనార్టీ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్‌ మహమ్మద్‌, ఉపసర్పంచ బురానుద్దీన తీవ్రంగా విమర్శించారు. శనివారం టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ డాక్టర్‌ మహమ్మద్‌హుస్సేన బీసీపై చేసిన తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో గుర్రెడ్డి కాలనీ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ బీసీపై అసత్య ఆరోపణలు తగదన్నారు. 25 ఏళ్లనుంచి బీసీ గురెడ్డి కాలసీలో గ్రామ పంచాయతీ వారు ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇస్తున్నారన్నారు. మహమ్మద్‌హుస్సేన ఇంటి ముందు కాల్వను పూడ్చి పుట్‌పాత నిర్మించుకున్నది ఎవరని పశ్నించారు. పట్టాల మంజూరు చేయించి డబ్బులు వసూలు చేసిన విషయం అందరికీ తెలుసు అని అన్నారు. అన్నీ తెలుసుకొని మాట్లాడితే మంచిదని వారు హితవు పలికారు. కార్యక్రమంలో పాతపాడు సర్పంచ మహేశ్వరరెడ్డి, టిప్‌టాప్‌ కలాం, బి.సుధాకర్‌రెడ్డి, దొనపాటి భాస్కర్‌రెడ్డి, కాశీం పాల్గొన్నారు. 



 

Updated Date - 2021-09-19T04:17:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising