ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రహదారుల నిర్మాణంలో విఫలం

ABN, First Publish Date - 2021-07-25T05:56:28+05:30

రహదారుల నిర్మాణంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జి తిక్కారెడ్డి అన్నారు.

బస్టాండులో వరి నాట్లు వేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కౌతాళం, జూలై 24: రహదారుల నిర్మాణంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జి తిక్కారెడ్డి అన్నారు. శనివారం కౌతాళంలోని పార్టీ కార్యాల యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశం అనంతరం కాలినడకన బస్టాండుకు బయలుదేరి అక్కడ నిలిచిన నీటిలో వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన రహదారులు సైతం పూ ర్తి చేయడం లేదని ఎద్దేవా చేశారు. టీడీపీ నాయకులు ఉలిగయ్య, చెన్నబసప్ప, అడి వప్పగౌడ్‌, వెంకటపతిరాజు, సురేష్‌నాయుడు, మంజు, కురువ వీరేష్‌ పాల్గొన్నారు.


ఆదోని: ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై కేసులు నమోదు చేయించడం తప్ప ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని టీడీపీ జిల్లా పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి భూపాల్‌చౌదరి అన్నారు. శనివారం ఆదోని పట్టణంలో గుంతలమయమైన రహదారుల వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భూపాల్‌చౌదరి మాట్లాడుతూ ఆదోని రోడ్డు అధ్వానంగా ఉన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నవరత్నాల్లో భాగంగా ఉచితంగా డబ్బులు అకౌంట్లలో వేసి ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారని విమర్శించారు. ఆదోనిలో మార్కెట్‌ యార్డు చుట్టూ రోడ్డు అధ్వానంగా ఉందని, రైతులు పంట ఉత్పత్తులు తీసుకు రావాలంటే ఇబ్బందులు పడే పరిస్థితి ఉందన్నారు. తక్షణమే మార్కెట్‌ యార్డు చుట్టూ ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయించాలని డిమాండ్‌ చేశారు. అలాగే బైపాల్‌ రోడ్డు పనులు త్వరగా ప్రారంభించి ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, గుడిసె శ్రీరాములు, బుద్దారెడ్డి, తిమ్మప్ప, వెంకటేష్‌, లక్ష్మీనారాయణ, నల్లన్న, మల్లికార్జున పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T05:56:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising