ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులంతా ఐకమత్యంగా ఉండాలి

ABN, First Publish Date - 2021-01-19T06:07:12+05:30

ప్రభుత్వ ఉద్యోగులంతా ఐకమత్యంగా ఉండాలని జడ్పీ సీఈవో ఎం.వెంకటసుబ్బయ్య తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1.  జడ్పీలో నల ్లబ్యాడ్జీలతో నిరసన 


కర్నూలు(న్యూసిటీ), జనవరి 18: ప్రభుత్వ ఉద్యోగులంతా ఐకమత్యంగా ఉండాలని జడ్పీ సీఈవో ఎం.వెంకటసుబ్బయ్య తెలిపారు. కలెక్టర్‌ వీరపాండియన్‌, ఎస్పీ కే.ఫక్కీరప్పను వ్యక్తిగతంగా దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం జడ్పీ ఆవరణలోని గాంఽధీ విగ్రహం వద్ద మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి పథం లో నడిపించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న జిల్లా అధికారులపై ఇలాంటి దూషణలు చేయడం సరికాదన్నారు. పీఆర్‌ ఎస్‌ఈ కే.సుబ్రహ్మణ్యం, జడ్పీ డిప్యూటీ సీఈవో టివి.భాస్కర్‌నాయుడు, డీఎల్‌డీవో శివశంకర్‌, కర్నూలు ఎంపీడీవో భాస్కర్‌నాయుడు, డీఎల్‌పీవో తిమ్మక్క, ఈవోఆర్డీ రఘునాథ్‌, పీఆర్‌,జడ్పీ, ఎంపీడీవో, ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.


క్రిష్ణగిరి: కలెక్టర్‌పై కొద్దిమంది వ్యక్తులు చేసిన అనుచిత వాఖ్యలకు నిరసనగా మండల పంచాయతీరాజ్‌ ఉద్యోగులు సోమవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేసారు. ఎంపీడీవో చిన్న క్రిష్ణారెడ్డి, పీఆర్‌ ఈవోఆర్‌డీ రామక్రిష్ణారావు, ఏఈ వహీద్‌ సాహెబ్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


కర్నూలు(స్పోర్ట్స్‌): కలెక్టర్‌, ఎస్పీలను దూషిస్తే సహించేది లేదని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఉద్యోగులు అన్నారు. సోమవారం డీఎ్‌సఏ స్టేడియం ఎదురుగా సీఈవో నాగరాజనాయుడు, చీఫ్‌ కోచ్‌ భూపతి, క్రీడాప్రాధికార సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. 

Updated Date - 2021-01-19T06:07:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising