ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

ABN, First Publish Date - 2021-12-09T04:51:28+05:30

ఉపాధ్యాయ, ఉద్యోగుల, కార్మిక పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీజేఏసీ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు డిమాండ్‌ చేశారు.

కర్నూలు పెద్ద మార్కెట్‌ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(ఎడ్యుకేషన్‌), డిసెంబరు 8: ఉపాధ్యాయ, ఉద్యోగుల, కార్మిక పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీజేఏసీ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు డిమాండ్‌ చేశారు. ఏపీజేఏసీ, ఏపీజేఏసీ-అమరావతి ఐక్యవేదిక ఇచ్చిన కార్యచరణ పిలుపు మేరకు రెండో రోజు బుధవారం కర్నూలు పట్టణంలోని కింగ్‌ మార్కెట్‌ ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో బోధన, బోధనేతర సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. 


మద్దికెర: మండలంలోని పెరవలి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు  భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ నాయకులు నాగరాజు, నారాయణస్వామి, ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, వీరోజిరావు, నాగరాజు, శ్రీనివాసులు, సరిత తదితరులు పాల్గొన్నారు. 


తుగ్గలి: తుగ్గలి తహసీల్దార్‌ కార్యాలయం, జిల్లాపరిషత్‌ హైస్కూల్‌ వద్ద నిరసన తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్‌ నిజాంఉద్దీన్‌, ఆర్‌ఐ సుధాకర్‌రెడ్డి, వీఆర్వోలు రమణారెడ్డి, కాశీరంగస్వామి, కృష్ణారెడ్డి, సాగర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T04:51:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising