ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాలిబన్లను తలపిస్తున్నారు

ABN, First Publish Date - 2021-10-21T05:14:51+05:30

తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపైన, నాయకులపైన భౌతిక దాడులకు దిగుతున్న వైసీపీ నాయకులు తాలిబాన్లను తలపిస్తున్నారని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

సోమిశెట్టి హౌస్‌ అరెస్ట్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సీఎం జగనపై సోమిశెట్టి ఆగ్రహం

కర్నూలు(అగ్రికల్చర్‌), అక్టోబరు 20:  తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపైన, నాయకులపైన భౌతిక దాడులకు దిగుతున్న వైసీపీ నాయకులు తాలిబాన్లను తలపిస్తున్నారని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. నిరసన తెలిపేందుకు సిద్ధమౌతున్న సోమిశెట్టి, ఇతర నాయకులను తెల్లవారుజామునే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తన నివాసం వద్ద సోమిశెట్టి విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా తాము నిరసన తెలుపుతామని, అధికార పార్టీ తరహాలో హింసకు తావు ఇవ్వబోమని చెప్పినా పోలీసులు వినలేదని అన్నారు. రాష్ట్రంలో తాలిబాన్ల పాలనను తలపించేలా హింస జరుగుతోందని అన్నారు. తమ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎంతో ఓర్పుతో తమను హింసకు దూరంగా ఉండాలని, ప్రజాస్వామ్యబద్ధంగానే నిరసన తెలపాలని సూచిం చారన్నారు. వైసీపీ అరాచక పాలనను ప్రజలకు తెలియజె ప్పాలని రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారన్నారు. శాంతియుతంగా తాము చేసే ఆందోళనలను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి జగన పోలీసులను పంపి గృహ నిర్బంధం చేయించారని ఆరోపించారు. ఈ చర్యలతో సీఎం జగన ప్రజల్లో మరింత చులకనైపోయారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపడం సహజమని, ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడం బాధ్యత అన్నారు. అధికార పార్టీ నాయకులకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత గుర్తెరగాలని అన్నారు. ఇందుకు భిన్నంగా తమ పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం, నాయకులను గాయపరచడం ఏమిటని ప్రశ్నించారు. 


Updated Date - 2021-10-21T05:14:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising