ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివ్యాంగులు ప్రతిభావంతులు: కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-12-04T05:37:02+05:30

దివ్యాంగులు.. ప్రతిభావంతులని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

    కర్నూలు(కలెక్టరేట్‌), డిసెంబరు 3: దివ్యాంగులు.. ప్రతిభావంతులని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు. వారు మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ దివ్యాంగులతో గడపడం ఆనందంగా ఉందన్నారు. అన్నీ ఉన్నా ఏమీ చేయని వారు నిజమైన వికలాంగులని, దివ్యాంగులైనా.. ఒక లక్ష్యంతో పని చేసేవారికి తప్పక గుర్తింపు ఉంటుందని అన్నారు. త్వరలో విభిన్న ప్రతిభావంతులకు జిల్లాలో 11 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇస్తామని తెలిపారు. అన్ని శాఖలలో వారి కోసం రోస్టర్లను వెరిఫై చేయిస్తామన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎంకేవీ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 73 వేల మంది విభిన్న ప్రతిభావంతులు ఉంటే.. ఇందులో 48,500 మందికి ప్రతి నెలా 14.54లక్షలు పింఛన్‌ ఇస్తున్నామన్నారు. విభిన్న ప్రతిభావంతుల జీవనోపాధికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తామన్నారు. డిజేబుల్డ్‌ హాస్టల్‌ నిధులు రాగానే పూర్తి చేయిస్తామన్నారు. సోలో డ్యాన్స్‌, గ్రూప్‌ డ్యాన్స్‌, పాటలు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం ల్యాప్‌ట్యాప్‌లు, టచ్‌ స్కీన్‌ మొబైల్‌లు, చెవిటి వినికిడి యంత్రాలను కలెక్టర్‌ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధులు సంక్షేమ శాఖ ఏడీ విజయ, మెప్మా పీడీ రాధికరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్రీనివాసులు, జీజీహెచ్‌ ఆర్‌ఎంవో వసుధ తదితరులు పాల్గొన్నారు.

    Updated Date - 2021-12-04T05:37:02+05:30 IST

    సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
    Advertising
    Advertising