ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వకులానదిలో వజ్రాన్వేషణ

ABN, First Publish Date - 2021-07-23T05:51:22+05:30

వకులానదిలో వజ్రాల అన్వేషణ మొదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రుద్రవరం, జూలై 22: వకులానదిలో వజ్రాల అన్వేషణ మొదలైంది. ఏటా వర్షాకాలంలో నల్లమల తీరంలోని నంద్యాల- ఒంగోలు రహదారి పక్కన ఉన్న నది వద్దకు వజ్రాలపై ఆశతో వందలాది మంది వస్తుంటారు. గుంటూరు, కడప, ప్రకాశం జిల్లావాసులతోపాటు నల్లమల తీరంలోని నంద్యాల, ఆళ్లగడ్డ, రుద్రవరం, కోటకొండ, ఎల్లావత్తుల, పెద్దకంబలూరుకు చెందిన పలువురు నదిని జల్లెడ పడుతున్నారు. వచ్చినవారిలో ఇద్దరికి గురువారం రెండు వజ్రాలు లభించాయని అన్వేషకులు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చినవారు గాజులపల్లె, ఆంజనేయులు కొట్టాలలో మకాం వేసి, ఉదయం నుంచి సాయంత్రం వరకూ వజ్రాలను అన్వేషిస్తున్నారు.


ఆశతో వచ్చా..


వజ్రాలు దొరుకుతున్నాయని ఆశతో కడప జిల్లా బద్వేలు నుంచి నాలుగు రోజుల క్రితం వచ్చాను. వజ్రాల కోసం వకులానదిలో వెతుకుతున్నాను. చిన్నపాటి వజ్రం దొరికినా కష్టాలు తీరుతాయని ఆశ.          - చెన్నమ్మ


చాలామందికి దొరికాయి..


ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి వజ్రాలు దొరుకుతాయన్న ఆశతో వచ్చాను. మా ప్రాంతం వాళ్లకు గతంలో వజ్రాలు దొరికాయి. అందుకే నా అదృష్టాన్ని కూడా పరిక్షించుకుంటున్నాను. - మల్లికార్జున

Updated Date - 2021-07-23T05:51:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising