ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డోన్‌ ప్రజలు గమనిస్తున్నారు

ABN, First Publish Date - 2021-01-21T05:34:48+05:30

డోన్‌ నియోజకవర్గంలో వైసీపీ నాయకుల అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు ధర్మవరం సుబ్బారెడ్డి, వలసల రామక్రిష్ణ, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మురళీకృష్ణ గౌడు అన్నారు.

మాట్లాడుతున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1.  మీ అరాచకాలు సాగవని భయమా? 
  2.  కేఈ ప్రభాకర్‌ రాకను ఓర్వలేకనే ఆరోపణలు 
  3.  డోన్‌ టీడీపీ నాయకుల ధ్వజం 


డోన్‌, జనవరి 20: డోన్‌ నియోజకవర్గంలో వైసీపీ నాయకుల అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు ధర్మవరం సుబ్బారెడ్డి, వలసల రామక్రిష్ణ, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మురళీకృష్ణ గౌడు అన్నారు. బుధవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాఉతూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తాత స్వగ్రామమైన బేతంచెర్లకు కేఈ ప్రతాప్‌ డబుల్‌ బీటీ రోడ్డు వేయించారని, అయినా వైసీపీ నాయకుల్లా ఏనాడూ కేఈ కుటుంబీకులు వెలికిగా మాట్లాడలేదని అన్నారు.   కేఈ మాదన్న స్వగ్రామం కంభాలపాడుకు ఆర్థిక మంత్రి బుగ్గన ఎప్పుడు రోడ్డు వేయించిందీ చెప్పాలని నిలదీశారు. అధికారం ఉందన్న అహంతోనే మాట్లాడుతున్న వైసీపీ నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. మట్కా, మద్యం అక్రమ వ్యాపారాలతో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని అన్నారు. వైసీపీ అభివృద్ధి అంతా శిలాఫలకాల్లోనే ఉందని,  కేఈ, కోట్ల కుటుంబాలు చేసిన అభివృద్ధి ఎక్కడికి వెళ్లినా ప్రజల్లో  కనిపిస్తున్నదని అన్నారు. వైసీపీ నాయకులు తిరిగే  రోడ్లన్నీ ఎవరు వేయించారో ప్రజలకు తెలుసునన్నారు. పెద్దలంటే గౌరవం లేకుండా మంత్రి వ్యంగంగా మాట్లాడారని విమర్శించారు. కేఈ ప్రభాకర్‌ మాట్లాడితే వైసీపీ నాయకులు ఉలికిపడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ మర్రి మోహన్‌ రెడ్డి, టీడీపీ నాయకులు విజయభట్టు, వెంకటరమణాచారి, ఆంజనేయగౌడు, మండల పార్టీ అధ్యక్షుడు వెంగనాయునిపల్లి శ్రీను, కేఈ శ్యాం, రంజిత్‌కిరణ్‌, కమలాపురం మధుసూదన్‌బాబు, ఉంగరానిగుండ్ల రాముడు, గార్లదిన్నె సుధాకర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-21T05:34:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising