ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లంచం అడిగారని ధర్నా

ABN, First Publish Date - 2021-06-22T05:39:42+05:30

తమ పొలాన్ని రికార్డుల్లో చేర్చడానికి రెవెన్యూ అధికారులు రూ. 5లక్షలు డిమాండ్‌ చేస్తున్నారని పారుమంచాల గ్రామానికి చెందిన ఒక కుటుంబ సభ్యులు సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు.

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న పారుమంచాల గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జూపాడుబంగ్లా, జూన్‌ 21: తమ పొలాన్ని రికార్డుల్లో చేర్చడానికి  రెవెన్యూ అధికారులు రూ. 5లక్షలు డిమాండ్‌ చేస్తున్నారని పారుమంచాల గ్రామానికి చెందిన ఒక కుటుంబ సభ్యులు   సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు. వారి వివరాల మేరకు.. వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి 854 సర్వేనంబరులో 6.14 ఎకరాల పొలం ఉంది. వెంకటేశ్వర్లు తన చెల్లెలు సుజాతకు 2.14 ఎకరాలు ఇచ్చాడు. వెంకటేశ్వర్లు చనిపోయాక భార్య భారతి పదేళ్ల కూతురు నివేదితను వదిలేసి వెళ్లిపోయిందని కర్నూలు త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో భారతి పొలమంతా తన పేరు మీదికి మార్చుకోడానికి ప్రయత్నిస్తోందనే మిగతా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పొలాన్ని వెంకటేశ్వర్లు కూతురు పేరు మీద రాయడానికి అధికారులు డబ్బులు డిమాండ్‌ చేశారని సోమవారం ధర్నా చేపట్టారు. రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ధర్నాలో వెంకటేశ్వర్లు కూతురు నివేదిత, చెల్లెల్లు సుజాత, మేరీ, రమణమ్మ, విజ్జి పాల్గొన్నారు.



Updated Date - 2021-06-22T05:39:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising