ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఏపీని సర్వనాశనం చేస్తున్నారు’

ABN, First Publish Date - 2021-10-17T05:02:18+05:30

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని నంద్యాల పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ డీసీసీ అధ్యక్షుడు జె.లక్ష్మీ నరసింహయాదవ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల టౌన్‌, అక్టోబరు 16: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని నంద్యాల పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ డీసీసీ అధ్యక్షుడు జె.లక్ష్మీ నరసింహయాదవ్‌ అన్నారు. శనివారం నంద్యాల కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం రాజీవ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ అధికారంలోకొచ్చాక రాష్ట్రాభివృద్ధి కుదేలై అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అన్నారు. ప్రతినెలా రాష్ట్రానికి వచ్చే రూ.11వేల కోట్ల ఆదాయంలో రూ.1,100 కోట్లు వివిధ కేంద్ర పథకాల కోసం కేంద్రం రాష్ట్ర ఖజానాలో జమ చేసే మొత్తాన్ని కచ్చితంగా కేంద్ర పథకాలకే వాడాల్సి ఉండగా రాష్ట్రంలో అది జరగడం లేదని అన్నారు. రాష్ట్ర ఆదాయంలో కేంద్రం జమ చేసే మొత్తంపోను మిగిలిన రూ.10వేల కోట్ల ఆదాయం అప్పుల రీ పేమెంట్‌ కోసం చెల్లిస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర ఆదాయంలో దాదాపు సగం ప్రతి నెలా అప్పుల చెల్లింపులకే సరిపోతుందని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తే రాజకీయం కోసం వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర పయోజనాలను ఫణంగా పెట్టడం తగదని అన్నారు. సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షుడు బాలస్వామి, ప్రధాన కార్యదర్శి మద్దిలేటి, మైనార్టీ విభాగం అధ్యక్షుడు హబీబ్‌పఠాన్‌ఖాన్‌, డీసీసీ కార్యదర్శి జనార్దన్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-17T05:02:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising