ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కురవని మేఘాలు

ABN, First Publish Date - 2021-06-24T05:36:20+05:30

సాయంత్రం అయ్యేసరికి ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటాయి.

డి.కొట్టాలలో వాడుపడుతున్న మొక్కజొన్న పంట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. వాడుపడుతున్న మొక్కజొన్న, మినుము పంటలు 
  2. 2,700 ఎకరాల్లో సాగు 
  3. ఆందోళనలో రైతులు 


రుద్రవరం, జూన్‌ 23: సాయంత్రం అయ్యేసరికి ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటాయి. కానీ చుక్క వాన కురవడం లేదు. ఇంకో పక్క మొక్కజొన్న, మినుము పంటలు వాడుపడుతున్నాయి. ఇటీవల కురిసిన వానలకు రుద్రవరం మండలంలో ఖరీఫ్‌ సీజన్‌ కింద 2,500 ఎకరాల్లో మొక్కజొన్న, 200 ఎకరాల్లో మినుము  సాగు చేశారు.  విత్తనాలు మొలకెత్తినప్పటి నుంచి వర్షాలు కురవలేదు. పంట చేతికి రాదని  రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే ఖరీఫ్‌ సీజన్‌ మొదట్లోనే వర్షాలు ఎండగడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగైతే ఈ సారి ఖరీఫ్‌ సీజన్‌లో గట్టెక్కుతామోలేదోనని ఆందోళన చెందుతున్నారు.  


పంటలు వాడుపడుతున్నాయి

మొక్కజొన్న, మినుము సాగు చేసి 10 నుంచి 20 రోజులు దాటుతోంది.  మొలక దశలో కనీసంగా వానలు కురవలేదు. ఖరీఫ్‌ సీజన్‌ ఎలా గడుస్తుందో? 

- వెంకట్‌రెడ్డి, రైతు, డి.కొట్టాల 


మొక్కజొన్న వాడిపోతోంది

మొక్కజొన్న పంట మూడు ఎకరాల్లో సాగు చేశా.  అప్పటి నుంచి వర్షాలు లేక వాడుపడుతోంది.  లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాను.  పంట వాడిపోతోంది.  

- చిన్న బ్రహ్మానందరెడ్డి, రైతు, డి.కొట్టాల 




Updated Date - 2021-06-24T05:36:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising