ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి వ్యాక్సినేషన్‌

ABN, First Publish Date - 2021-01-16T06:05:05+05:30

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శనివారం నుంచి మొదలు కానుంది. వ్యాక్సినేషన్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(హాస్పిటల్‌), జనవరి 15: కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శనివారం నుంచి మొదలు కానుంది. వ్యాక్సినేషన్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలిరోజు 2700 మందికి టీకా వేయనున్నారు. టీకా తీసుకున్న తర్వాత ప్రతికూలత ఘటనలు కనిపిస్తే చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పది పడకలను సిద్ధం చేశారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత అదే ఆసుపత్రిలో అరగంట వరకు అబ్జర్వేషన్‌లో ఉంచుతారు. ఆ సమయంలో ప్రతికూల ఘటనలు చోటుచేసుకుంటే చికిత్సపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 


పడకలు సిద్ధం చేశాం

కొవిడ్‌ టీకా తీసుకున్న వారిలో ప్రతికూల పరిస్థితులు కనిపిస్తే చికిత్స అందించేందుకు కర్నూలు జీజీహెచ్‌లో పది పడకలు ఏర్పాటు చేశాం. ఈ వార్డులో వారిని నిపుణులు పర్యవేక్షిస్తారు. - డా.జి.నరేంద్రనాథరెడ్డి, సూపరింటెండెంట్‌, కర్నూలు జీజీహెచ్‌


ఒక కేసు

జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి కనిష్ఠ స్థాయికి చేరింది. శుక్రవారం ఒక కేసు నమోదైంది. దీంతో బాధితుల సంఖ్య 60,715కు చేరింది. ఇందులో 101 యాక్టివ్‌ కేసులు కాగా 60,127 మంది కరోనా నుంచి విముక్తి పొంది డిశ్చార్జి అయ్యారు. 

Updated Date - 2021-01-16T06:05:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising