14 ఆసుపత్రుల్లో కొవిడ్ వైద్య సేవలు
ABN, First Publish Date - 2021-06-12T05:30:00+05:30
జిల్లాలోని 14 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల ద్వారా కొవిడ్ వైద్యసేవలు అందుబాటులో ఉంటాయని ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డా.సుమన్ ఓ ప్రకటనలో తెలిపారు.
కర్నూలు(హాస్పిటల్), జూన్ 12: జిల్లాలోని 14 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల ద్వారా కొవిడ్ వైద్యసేవలు అందుబాటులో ఉంటాయని ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డా.సుమన్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొదట 31 కొవిడ్ ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా చికిత్సలు అందేవని, అయితే 0-5 మంది కొవిడ్ బాధితులను అడ్మిషన్ చేర్చుకోకపోవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు 17 ప్రైవేటు ఆసుపత్రులను జాబితా నుంచి తొలగించామని తెలిపారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి జిల్లా ఆసుపత్రి నంద్యాల, ఏరియా ఆసుపత్రి ఆదోని, శాంతిరాం మెడికల్ కాలేజ్ నంద్యాల, విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్, అమీలియో హాస్పిటల్, వీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ గాయత్రి హాస్పిటల్, రమేష్ హాస్పిటల్, ఎంఎస్‌ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, నద్యాలకు చెందిన సెవెన్ హెల్ హాస్పిటల్, ఉదయానంద హాస్పిటల్, సాయివాణి హాస్పిటల్‌లో కొవిడ్ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
Updated Date - 2021-06-12T05:30:00+05:30 IST