ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో ఐదుగురి మృతి

ABN, First Publish Date - 2021-05-08T05:38:00+05:30

జిల్లాలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కొత్త కేసులు 1,342


కర్నూలు(హాస్పిటల్‌), మే 7: జిల్లాలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి.. శుక్రవారం 4,761 మందికి పరీక్షలు నిర్వహించగా 1,342 మందికి వైరస్‌ సోకింది. ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 89,709కు చేరగా.. 14,675 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో కొవిడ్‌ పాజిటివ్‌తో ఐదుగురు మృతి చెందగా మరణాల సంఖ్య 582కు చేరింది.


నేటి నుంచి 17 కేంద్రాల్లో కొవాగ్జిన్‌
జిల్లాలోని 17 ప్రభుత్వ ఆసుపత్రులు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో శనివారం నుంచి కొవాగ్జిన్‌ రెండో డోసు వేయనున్నట్లు డీఐవో డా.విశ్వేశ్వరరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సెంటర్‌కు 300 డోసులు కేటాయించామని, శనివారం స్టాకు ఉన్న వరకు వేస్తామని అన్నారు. కర్నూలులో జీజీహెచ్‌, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లయిన జొహరాపురం, రోజాస్ట్రీట్‌,  వీకర్‌సెక్షన్‌ కాలనీ, బండిమెట్ట, శరీన్‌నగర్‌, నంద్యాలలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, ఆత్మకూరు బస్టాండు, దేవనగర్‌, ఎంఎస్‌నగర్‌, ఆత్మకూరులోని వడ్లపేట అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, పీహెచ్‌సీలు అయిన చాపిరేవుల, నారాయణపురం, జిల్లెల, యు.కొత్తపల్లి, ఎర్రగుంట్ల, తిమ్మాపురం, రెట్టల చెరువులో కొవాగ్జిన్‌ రెండో డోసు వేయనున్నట్లు తెలిపారు.

అదనపు కొవిడ్‌ వార్డు: కలెక్టర్‌
కర్నూలు(హాస్పిటల్‌), మే 7: కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వసతులతో కూడిన తాత్కాలిక అదనపు కొవిడ్‌ వార్డు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు. శుక్రవారం ఆసుపత్రిలో వార్డు ఏర్పాటుకు స్థలాన్ని ఆయన పరిశీలించారు. మెడికల్‌ కాలేజీ న్యూలెక్చరర్‌ గ్యాలరీలో సమీక్ష నిర్వహించారు. ఆక్సిజన్‌, రెమిడీసీవర్‌ దుర్వినియోగం కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్‌ను తనిఖీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.నరేంద్రనాథ్‌ రెడ్డి, ప్రిన్సిపాల్‌ డా.జిక్కి, డిప్యూటీ సూపరింటెం డెంట్‌ డా.ఎ.భగవాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-08T05:38:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising