ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగిపోయిన భవనం పనులు

ABN, First Publish Date - 2021-05-08T05:30:00+05:30

చాగలమర్రి గ్రామంలో ఉర్దూ పాఠశాల నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచి పోయాయి.

నిలిచిపోయిన ఉర్దూ పాఠశాల భవన నిర్మాణ పనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. కాంట్రాక్టర్‌కు అందని బిల్లులు 
  2. ఇబ్బంది పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు 


చాగలమర్రి, మే 8: చాగలమర్రి గ్రామంలో ఉర్దూ పాఠశాల నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచి పోయాయి. రూ.24 లక్షల మైనార్టీ నిధులతో భవన నిర్మాణ పనులను రెండేళ్ల క్రితం కాంట్రాక్టర్లు చేపట్టారు. ఇందులో రూ.23 లక్షల వరకు పనులు చేశామని, మరో రూ.5 లక్షలు బిల్లులు రావాల్సి ఉందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. భవన నిర్మాణ పనులు   స్లాబ్‌ వరకు వేగంగా పూర్తి చేశారు.  ప్రభుత్వం మారాక   కాంట్రాక్టర్‌కు బిల్లులు ఆగిపోయాయి. దీంతో పనులు అర్ధాంతరంగా ఆపేశారు.  పాఠశాల భవనం పూర్తి కాక పోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. 1 నుంచి 9వ తరగతి వరకు  80 మంది విద్యార్థులు ఒకే గదిలో కూర్చోవాల్సి  వస్తోంది.  ఉన్నతాధికారులు స్పందించి భవన పనులు పూర్తి చేసి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఈ విషయం గురించి పాఠశాల హెచ్‌ఎం ఇసుల్లాఖాన్‌ను వివరణ కోరగా.. ఉర్దూ పాఠశాల భవనాలు నిలిచిన మాట వాస్తవమే అన్నారు.  కాంట్రాక్టర్‌కు బిల్లు రాక పనులు చేయలేదని, ఈ విషయంపై జిల్లా అధికారులకు నివేదికలు పంపించామని తెలిపారు. మంజూరైన నిధుల వరకు పనులు చేశామని కాంట్రాక్టర్లు చెబుతున్నారని అన్నారు. పాత ధరల ప్రకారం అంచనా వేయడంతో మం జూరైన నిధులు సరిపోలేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారని అన్నారు.  ఈ విషయం అధికారులకు తెలియజేశామన్నారు.  

Updated Date - 2021-05-08T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising