ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-03-06T05:41:01+05:30

నగర పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని, కౌంటింగ్‌ ప్రక్రియను సజావుగా విజయవంతం చేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీర పాండియన్‌ మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసులుకు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు, మార్చి 5: నగర పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని, కౌంటింగ్‌ ప్రక్రియను సజావుగా విజయవంతం చేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీర పాండియన్‌ మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసులుకు సూచించారు. శుక్రవారం గూడూరు నగర పంచాయతీ పరిధిలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను కలెక్టర్‌ పరిశీలించారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గూడూరు నగర పంచాయతీలో అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లలో లోపాలు లేకుండా చూసుకోవాలని పోలీసు అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఓటర్లందరికీ పోలింగ్‌ కేంద్రాల స్థాయి అధికారులచే ఓటర్ల స్లిప్పులను పంపిణీ చేయించి, పూర్తి చేయాలని తహసీల్దార్‌ వెంకటలక్ష్మిని  ఆదేశించారు. అలాగే పోలింగ్‌ కేంద్రాల్లో విద్యుత్‌, తాగునీరు, ఫర్నీచర్‌, బారీకేడింగ్‌ తదితర అవసర మైన ఏర్పాట్లను తక్షణమే పూర్తి చేయాలని కమిషనర్‌ను సూచించారు. ఆయన వెంట కర్నూలు ఆర్డీవో వెంకటేశ్వర్లు, కమిషనర్‌ జి.శ్రీనివాసులు, ఏఈ పవన్‌కుమార్‌ రెడ్డి, సీఐ శ్రీధర్‌, ఎస్‌ఐ నాగార్జున ఉన్నారు.


వలంటీర్లు స్లిప్పులు పంపిణీ చేస్తే చర్యలు 

డోన్‌: మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ఓటరు స్లిప్పులను బీఎల్‌వోల ద్వారా పంపిణీ చేయాలని, వలంటీర్లతో పంపిణీ చేయిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ జి.వీర పాండియన్‌ హెచ్చరించారు. శుక్రవారం డోన్‌ మున్సిపాలిటీలోని పోలింగ్‌ కేంద్రాలను, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్ర్టాంగ్‌ రూమ్‌లను ఆయన పరిశీలించారు. మున్సిపల్‌ కమిషనర్‌ కేఎల్‌ఎన్‌ రెడ్డి, డీఎస్పీ నరసింహారెడ్డికి కలెక్టర్‌ పలు సూచనలు చేశారు. కర్నూలు ఆర్డీవో వెంకటేశ్వర్లు, పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం ఉన్నారు. 


Updated Date - 2021-03-06T05:41:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising