ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ కట్టడిలో సీఎం విఫలం

ABN, First Publish Date - 2021-06-22T05:15:41+05:30

కొవిడ్‌తో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని తెలుగుదేశం పార్టీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గౌరు చరితరెడ్డి, కోట్ల సుజాతమ్మ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌ ముఖ్యమంత్రి జగన్‌కి విజ్ఞప్తి చేశారు.

జేసీకి వినతి పత్రం ఇస్తున్న టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలి
  2. టీడీపీ నాయకుల డిమాండ్‌


కర్నూలు(అగ్రికల్చర్‌), జూన్‌ 21: కొవిడ్‌తో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని తెలుగుదేశం పార్టీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గౌరు చరితరెడ్డి, కోట్ల సుజాతమ్మ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌ ముఖ్యమంత్రి జగన్‌కి విజ్ఞప్తి చేశారు.  జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డికి ఈ మేరకు సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. కొవిడ్‌ను కట్టడి చేసే విషయంలో మొదటి నుంచి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు స్వయంగా ప్రభుత్వాసుపత్రులకు వెళ్లి రోగులను పరామర్శిసున్నారని, ఏపీలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు వారి నివాసాలకే పరిమితమయ్యారని విమర్శించారు.  తిరుపతి, అనంతపురం తదితర ప్రాంతాలలో ఆక్సిజన్‌ అందక చనిపోయారని, ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారమణమని ఆరోపించారు. భేషజాలకు పోయి విపక్షాల సూచనలు, సలహాలను పాలకులు పట్టించుకోలేదని అన్నారు. పైగా డాక్టర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నంద్యాల నాగేంద్రకుమార్‌, దరూర్‌ జేమ్స్‌, ప్రభాకర్‌ యాదవ్‌, హనుమంతరావు చౌదరి, సత్రం రామక్రిష్ణ, రాజు యాదవ్‌, బజారన్న పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T05:15:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising