ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెన్నకేశవుడి ప్రభోత్సవం

ABN, First Publish Date - 2021-10-17T05:07:53+05:30

మండల పరిధిలోని కందనాతి గ్రామంలో చెన్నకేశవస్వామి ప్రభోత్సవం శనివారం కన్నులపండువగా జరిగింది.

ప్రభోత్సవాన్ని మోసుకుని తీసుకెళ్తున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఎమ్మిగనూరు టౌన్‌, అక్టోబరు 16: మండల పరిధిలోని కందనాతి గ్రామంలో చెన్నకేశవస్వామి ప్రభోత్సవం శనివారం కన్నులపండువగా జరిగింది. స్వామివారికి శుక్రవారం రాత్రి నుంచే విశేష పూజలు నిర్వహించారు. అర్ధరాత్రి స్వామివారి ఉత్సవమూర్తిని ప్రభలో ఆశీనులను చేసి కొండ మీద నుంచి గ్రామ శివారులో ఉన్న జమ్మి చెట్టు వరకు మోసుకుంటూ వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రభను మోసుకుంటూ కొండమీద ఉన్న స్వామివారి ఆలయానికి చేర్చారు. ఈ వేడుకను చూసేందుకు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రూరల్‌ సీఐ బీఏ మంజునాథ, ఎస్‌ఐ సునీల్‌కుమార్‌ బందోబస్తు నిర్వహించారు. 


Updated Date - 2021-10-17T05:07:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising