చండ్ర రాజేశ్వరరావు వర్ధంతి
ABN, First Publish Date - 2021-04-10T05:02:13+05:30
పత్తికొండలోని సీఆర్ భవన్‌లో సీపీఐ నేత చండ్ర రాజేశ్వరరావు వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. సీఆర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.
పత్తికొండటౌన్, ఏప్రిల్ 9: పత్తికొండలోని సీఆర్ భవన్‌లో సీపీఐ నేత చండ్ర రాజేశ్వరరావు వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. సీఆర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు గురుదాసు, మండల, పట్టణ కార్యదర్శులు రాజాసాహెబ్, సురేంద్రకుమార్, ప్రజా సంఘాల నాయకులు కారన్న, రంగన్న, వీరన్న, గిడ్డయ్య, కారుమంచి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మిగనూరు టౌన్: సీపీఐ జాతీయ కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు వర్థంతిని శుక్రవారం నిర్వహించారు. ఆ పార్టీ తాలుకా సహాయ కార్యదర్శి చిన్నన్న, జిల్లా కార్యవర్గసభ్యుడు భాస్కర్‌యాదవ్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగన్న, జిల్లా సహాయ కార్యదర్శి విజేంద్ర, ఏఐటీయూసీ తాలుక కార్యదర్శి బాలరాజు పాల్గొన్నారు.
దేవనకొండ: దేవనకొండలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం సీపీఐ అగ్రనేత చండ్ర రాజేశ్వరరావు వర్ధంతిని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు మద్దిలేటిశెట్టి, మండల కార్యదర్శి నర్సారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సీపీఐ మండల నాయకులు రంగస్వామి, రంగన్న, జయన్న, నెట్టెకల్లు, శ్రీనివాసులు, కోదండ పాల్గొన్నారు.
Updated Date - 2021-04-10T05:02:13+05:30 IST