ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గొలుసు తెంపిన గొరవయ్యలు

ABN, First Publish Date - 2021-10-19T05:41:30+05:30

దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవాల్లో భాగంగా సోమవారం జరిగిన గొరవయ్యల నృత్య ప్రదర్శన కమనీయంగా సాగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1.  శివనామ స్మరణతో మార్మోగిన దేవరగట్టు


హొళగుంద/ ఆలూరు రూరల్‌, అక్టోబరు 18: దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవాల్లో భాగంగా సోమవారం జరిగిన గొరవయ్యల నృత్య ప్రదర్శన కమనీయంగా సాగింది. అనంతరం వేదపండితులు నిర్ణయించిన ముహూర్తంలో సింహాసన కట్ట వద్ద మాళమల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. గొరవయ్యల నృత్య డమరుక నడుమ గొలుసు తెంపే కార్యక్రమం మొదలైంది. బల్లూరుకు చెందిన గొరవయ్య గాదిలింగస్వామి ఇనుప గొలుసును మూడో  ప్రయత్నంలో తెంపారు. గొరవయ్యల డమరుకనాదం, శివనామ స్మరణతో దేవరగట్టు మారుమోగింది. ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలి వచ్చారు. సాయంత్రం దేవదాసీల క్రీడలు సాగాయి. బన్ని ఉత్సవాలలో చివరి ఘట్టమైన వసంతోత్సవంలో భక్తులపై గొరవయ్యలు రంగులను చల్లారు. గూళ్యంకు చెందిన వీరశైవులు దేవరగట్టులో అన్నదానం చేపట్టారు. 19న మంగళవారం ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ పూజారులు, కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఆలూరు సీఐ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ఎస్‌ఐలు విజయ్‌కుమార్‌, రామాంజులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-10-19T05:41:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising