ఫిబ్రవరి 18న బుజ్జి ఇలా రా... చిత్రం విడుదల
ABN, First Publish Date - 2021-12-19T05:01:20+05:30
హాస్యనటులు ధన్‌రాజ్, సునీల్ హీరోలుగా నటించిన బుజ్జి ఇలారా.. అనే చిత్రాన్ని ఫిబ్రవరి 18న విడుదలకు సిద్ధం చేసినట్లు ప్రముఖ సినీ దర్శకుడు నాగేశ్వరరెడ్డి తెలిపారు.
- రాఘవేంద్రుడిని దర్శించుకున్న సినీ దర్శకుడు నాగేశ్వరరెడ్డి
మంత్రాలయం, డిసెంబరు, 18: హాస్యనటులు ధన్‌రాజ్, సునీల్ హీరోలుగా నటించిన బుజ్జి ఇలారా.. అనే చిత్రాన్ని ఫిబ్రవరి 18న విడుదలకు సిద్ధం చేసినట్లు ప్రముఖ సినీ దర్శకుడు నాగేశ్వరరెడ్డి తెలిపారు. శనివారం రాఘవేంద్రస్వామి దర్శనార్థం మంత్రాలయం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌ఎన్‌ఎస్ క్రియేషన్స్ ద్వారా క్రైమ్‌థ్రిల్లర్ చిత్రంగా ప్రముఖ తమిళ హీరోయిన్ చాందినీ తమిళ అర్సన్ నటిస్తున్నట్లు తెలిపారు. 2022 సంక్రాంతి రోజున బుజ్జి ఇలారా.. ట్రైలర్‌ను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాతలు అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి, జగదీష్‌లు అన్నారు. మరో చిత్రానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. అనంతరం గ్రావ ుదేవత మంచా లమ్మను దర్శించుకున్నారు. తరువాత రాఘవేంద్రస్వామి మూలబృందా వనానికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో నిర్మాత అగ్రహారం నాగిరెడ్డి, మఠం మేనేజర్ వెంకటేష్ జోషి, బిందుమాధవ్, వాజేంద్ర ఆచార్‌లు పాల్గొన్నారు.
Updated Date - 2021-12-19T05:01:20+05:30 IST