ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వారికి జీతాలు ఇవ్వాలి’

ABN, First Publish Date - 2021-05-17T05:25:20+05:30

రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్‌ ఆలయాల్లో పూజలు నిర్వహించే అర్చకులకు ప్రభుత్వం జీతాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సేవా సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి హెచ్‌కే మనోహర్‌రావు డిమాండ్‌ చేశారు.

ఆర్థిక సాయం అందజేస్తున్న సంఘం ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(న్యూసిటీ), మే 16: రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్‌ ఆలయాల్లో పూజలు నిర్వహించే అర్చకులకు ప్రభుత్వం జీతాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సేవా సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి హెచ్‌కే మనోహర్‌రావు డిమాండ్‌ చేశారు. నగరంలోని కొత్త అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆదివారం దాతల సహకారంతో ప్రైవేట్‌ ఆలయాల్లో అర్చక, పౌరోహిత్యం నిర్వహించే బ్రాహ్మణ కుటుంబాల్లో చదువుకునే విద్యార్థులకు రూ.2.5 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. మనోహర్‌ మాట్లాడుతూ ప్రైవేట్‌ దేవాలయాల్లో పని చేసే అర్చక కుటుంబాలు అతి తక్కువ జీతాలకు పని చేస్తూ దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు. ఇలాంటి వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆర్థిక సాయం అందజేసినట్లు ఆయన తెలిపారు. ప్రైవేట్‌ కమిటీ నిర్వహణలో ఉన్న పాస్టర్లు, మౌజంలకు ఇచ్చిన విధంగానే అర్చకులకు ప్రతి నెల రూ.10 వేలు గౌరవ వేతనం చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నిర్వాహకులు షణ్ముఖ గణేష్‌, 17వ వార్డు కార్పొరేటర్‌ కైప పద్మలతరెడ్డి, మాడుగుల భాస్కరశర్మ, డా.జి.సుబ్బరామయ్య, బ్రాహ్మణ సంఘం అఽధ్యక్షుడు కళ్లె చంద్రశేఖర్‌శర్మ, హెచ్‌కే రాజశేఖర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-17T05:25:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising