ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాయలసీమలో బలోపేతంపై నేడు BJP రాష్ట్రస్థాయి సమావేశం

ABN, First Publish Date - 2021-09-05T13:05:32+05:30

రాయలసీమ జిల్లాల్లో బీజేపీ బలోపేతంపై నేడు కర్నూలు జిల్లాలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు : రాయలసీమ జిల్లాల్లో బీజేపీ బలోపేతంపై నేడు కర్నూలు జిల్లాలో రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ నేతలు శివప్రకాష్‌, దియోధర్‌ హాజరుకానున్నారు. సీమ జిల్లాల్లో బీజేపీ బలోపేతంతో పాటు పలు కీలక విషయాలపై నేడు ముఖ్యనేతలు చర్చించనున్నారు. మరీ ముఖ్యంగా గత నాలుగైదు రోజులుగా వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై జరుగుతున్న వివాదంపై కూడా చర్చించనున్నారు. మరోవైపు.. బహిరంగ ప్రదేశాల్లో గణేష్‌ విగ్రహాల ఏర్పాటు చేయకూడదని నంద్యాల సబ్‌ కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి సూచించారు.


సోషల్ మీడియా పోస్టులపై విచారణ

ఇదిలా ఉంటే.. వినాయక పండుగకు ఆంక్షలు విధించడం సరికాదని, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారంటూ ఆదోనికి చెందిన బీజేపీ సానుభూతిపరుడు పవన్‌కుమార్‌ అలియాస్‌ కల్యాణ్‌ను ఆదోని టూటౌన్‌ పోలీసులు శనివారం విచారించారు. తాను ఏ కులానికి, మతానికి వ్యతిరేకం కాదని, వినాయక చవితి పండుగను ఎందుకు జరపడం లేదని మాత్రమే ప్రశ్నించానని పవన్‌కుమార్‌ పేర్కొన్నారు. తర్వాత బీజేపీ నాయకులు వెళ్లి పోలీసులతో చర్చించారు. దీంతో విచారణ నిమిత్తం ఆదివారం స్టేషన్‌కు రావాలని పవన్‌కుమార్‌ను పోలీసులు పంపించారు.

Updated Date - 2021-09-05T13:05:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising