ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువు కట్టపై బయో వ్యర్థాల దహనం

ABN, First Publish Date - 2021-06-14T05:29:28+05:30

డోన్‌ మండలంలోని కంబలపాడు రహదారిలో అభిరెడ్డిపల్లె చెరువు కట్టపై వ్యర్థాలు మంటల్లో కాలుతున్నాయి.

చెరువుకట్టపై కాలిపోతున్న వ్యర్థాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డోన్‌, జూన్‌ 13:  డోన్‌ మండలంలోని కంబలపాడు రహదారిలో అభిరెడ్డిపల్లె చెరువు కట్టపై వ్యర్థాలు మంటల్లో కాలుతున్నాయి. గత రెండు రోజులుగా మంటలు వ్యాపిస్తుండటంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. అభిరెడ్డిపల్లె చెరువు కట్ట వెంట రాత్రివెళల్లో వ్యర్థాలను భారీగా డంప్‌ చేశారు. కాలం చెల్లిన టాబ్లెట్స్‌తో పాటు సిరంజీలు, సెలెన్‌ బాటిళ్లును బట్ట పెలికల్లో కప్పి డంప్‌ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. డంప్‌ చేసిన వ్యర్థాలు వంకలోకి వెళితే నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మైనర్‌ ఇరిగేషన్‌ అధికారులు చెరువుకట్టపై ఉన్న వ్యర్థాలను పరిశీలించారు. వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో గత రెండు రోజులుగా మంటల్లో కాలుతూనే ఉన్నాయి. దీంతో వాటి నుంచి దుర్వాసన వెదజల్లుతుండటంతో రహదారిపై వెళ్లే వారు ఇబ్బందులకు గురవుతున్నారు. చెరువుకట్టపై వ్యర్థాలను తామే కాలుస్తున్నామని డోన్‌ మైనర్‌ ఇరిగేషన్‌ ఏఈ నారాయణ తెలిపారు. వ్యర్థాలను చెరువుకట్టపై వ్యర్థాలను ఎవరు డంప్‌ చేశారనే దానిపై విచారణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2021-06-14T05:29:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising