ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఆర్‌డీఏ పీడీని నిలదీసిన లబ్ధిదారులు

ABN, First Publish Date - 2021-10-17T05:15:39+05:30

జూపాడుబంగ్లా గ్రామంలో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలను శనివారం డీఆర్‌డీఏ పీడీ వెంకటేశులు పరి శీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జూపాడుబంగ్లా,  అక్టోబరు 16: జూపాడుబంగ్లా గ్రామంలో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలను శనివారం డీఆర్‌డీఏ పీడీ వెంకటేశులు పరి శీలించారు. బిల్లులు సమయానికి వస్తున్నాయా? పొదుపు గ్రూపులలో రూ. 40వేలు రుణం ఇస్తున్నారా అని లబ్ద్ధిదారులను పీడీ అడిగారు. దీం తో లబ్ధిదారులు తమ ఆవేదనను ఆయన ముందు వెలిబుచ్చారు. జూపాడుబంగ్లాలో దాదాపు 50 ఇళ్లు ప్రారంభించగా అందులో బేస్‌లెవెల్‌, లెంటల్‌, స్లాబ్‌ లెవెల్‌ ఇళ్లు నిర్మించుకున్న ఇంతవరకు ఒక్కరికి కూడా బిల్లులు పడలేదని తెలిపారు. బిల్లులు పడకపోవడంతో మిగతావారు కూడా నిర్మించుకునేందుకు ముందుకు రావడంలేదని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇనుము తెచ్చుకునేందుకు కర్నూలుకు వెళ్లాల్సి వస్తోందని, ఒకటన్నుకు రూ.900 ఖర్చు అవుతోందని తెలిపారు. పొదుపులో రుణం రూ. 40 వేలు తీసుకొచ్చని ఇంటిని నిర్మించుకునేందుకు ప్రభుత్వం చెప్పినా గ్రూపులో ఉన్న మిగతా సభ్యులు తీర్మానం ఇవ్వడం లేదని, దీంతో గొడవలు జరుగుతున్నాయని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇనుము, ఇసుక దగ్గరలో ఉంచాలని, బిల్లులు త ్వరితగతిన మంజూరు చేయాలని డిమాండు చేశారు. ఈ విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు.  


Updated Date - 2021-10-17T05:15:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising