ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అధికారులు స్థలాలు చూపడం లేదు’

ABN, First Publish Date - 2021-12-04T05:20:16+05:30

రెవెన్యూ అధికారులు స్థలాలు చూపించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తూ ఎం.అగ్రహారం గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులు గ్రామ శివారులోని ఇళ్ల స్థలాల్లోకి వెళ్లి శుక్రవారం హద్దులను వేసుకున్నారు.

ఇళ్ల స్థలాల వద్ద ఉన్న లబ్ధిదారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్దికెర, డిసెంబరు 3: రెవెన్యూ అధికారులు స్థలాలు చూపించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తూ ఎం.అగ్రహారం గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులు గ్రామ శివారులోని ఇళ్ల స్థలాల్లోకి వెళ్లి శుక్రవారం హద్దులను వేసుకున్నారు. స్థలాల్లోకి వెళ్లి ముళ్లకంచెలను తొలగించి హద్దులను వేసుకున్నారు. వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016లో మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పొందామని తెలిపారు అయితే స్థలాలు లేక పోవడంతో ఇళ్లు కట్టుకోలేక అద్దె ఇళ్లల్లో నివసిస్తున్నామన్నారు. ప్రభుత్వం పట్టాలు ఇచ్చినప్పుడు రెవెన్యూ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే హద్దులు చూపించకపోతే మీమే హద్దులు వేసుకుని స్థలాలు పంచుకుంటామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రమేష్‌, చిన్నపెద్ది, హుసేన్‌పీరా, ఆనంద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్‌ నాగభూషణంను వివరణ కోరగా సమయం ఇస్తే స్థలాలు చూపిస్తామని తెలిపారు.

Updated Date - 2021-12-04T05:20:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising