ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏటీఎంల వద్ద అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2021-12-05T06:19:21+05:30

ఏటీఎం కేంద్రాలలో కార్డులు మార్చి ప్రజలను మోసాలు చేస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. శనివారం ఆయన సైబర్‌ అలర్ట్‌పై ప్రకటన విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. ఎవరికీ పిన్‌ నెంబర్లు ఇవ్వకూడదు 
  2. ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌ కుమార్‌ రెడ్డి 


కర్నూలు, డిసెంబరు 4: ఏటీఎం కేంద్రాలలో కార్డులు మార్చి ప్రజలను మోసాలు చేస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. శనివారం ఆయన సైబర్‌ అలర్ట్‌పై ప్రకటన విడుదల చేశారు. ఎస్పీ మాట్లాడుతూ ఏటీఎం కేంద్రాల వద్ద అపరిచితులను నమ్మి కార్డులు, పిన్‌ నెంబర్లు ఇవ్వకూడదని సూచించారు. డబ్బులు డ్రా చేసి ఇస్తామని చెప్పి ఏటీఎం కార్డులు తీసుకుని పిన్‌ నెంబర్‌ తెలుసుకుంటారని, ఒరిజినల్‌ ఏటీఎం కార్డులు తీసుకుని డూప్లికేట్‌ కార్డులు ఇచ్చి మోసాలు చేస్తున్నారని అన్నారు. ఏటీఎం కార్డుల వెనుకవైపు పిన్‌ నెంబర్లు రాసుకుని ఉండటంతో ఆ విషయం తెలుసుకుంటున్నారన్నారు. పిన్‌ నెంబర్లు కార్డుల వెనుక వైపు రాయకూడదన్నారు. నగదు డ్రా చేయడం తెలియకపోతే అక్కడే ఉన్న ఏటీఎం సెక్యూరిటీ గార్డులు లేదా తెలిసిన వ్యక్తుల సాయం తీసుకోవాలని ఆయన సూచించారు. 


ఇటీవల వచ్చిన ఫిర్యాదులు కొన్ని


కర్నూలు ఏటీఎం కేంద్రంలో రూ.45 వేలు డ్రా చేసి ఇస్తామని చెప్పి అపరిచిత వ్యక్తి మోసగించారని కల్లూరు మండలం రాజీవ్‌నగర్‌కు చెందిన వి.హనుమయ్య ఫిర్యాదు చేశారు. 


కర్నూలు ఏటీఎం కేంద్రంలో రూ.1.34 లక్షలు డ్రా చేసి ఇస్తానని చెప్పి అపరిచిత వ్యక్తి మోసగించారని ఆదిత్యనగర్‌కు చెందిన తిరుపాల్‌ నాయక్‌ ఫిర్యాదు చేశారు. 


కర్నూలు ఆర్టీసీ బస్టాండుకు ఎదురుగా ఉన్న ఏటీఎం కేంద్రంలో రూ.66వేలు డ్రా చేసి ఇస్తానని చెప్పి అపరిచిత వ్యక్తి మోసం చేశారని గొందిపర్లకు చెందిన చిదంబరం ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2021-12-05T06:19:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising