ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అత్యవసర పరిస్థితుల్లోనే ఆటోలు తిరగాలి’

ABN, First Publish Date - 2021-05-11T05:34:29+05:30

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో కర్ఫ్యూ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆటోలు తిరగాలని కర్నూలు ట్రాఫిక్‌ డీఎస్పీ మహబూబ్‌ బాషా అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు, మే 10:  రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో కర్ఫ్యూ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆటోలు తిరగాలని కర్నూలు ట్రాఫిక్‌ డీఎస్పీ మహబూబ్‌ బాషా అన్నారు.   సోమవారం కర్నూలు డీఎస్పీ మహేష్‌ ఆధ్వర్యంలో ఆటో యూనియన్‌ల నాయకులతో కర్ఫ్యూ ఆంక్షలపై ఆయన మాట్లాడారు.    నగరంలోని వివిధ ఆటో యూనియన్లు, ఆటోస్టాండ్లకు సంబంధించి సుమారు 30 ఆటోలకు పోలీస్‌శాఖ ఈపాస్‌లు జారీ చేసిందన్నారు. ప్రతి ఒక్కరూ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఆటోలో ప్రయాణించాలని, అనవసరంగా బయట తిరగరాదన్నారు. మాస్కులు ధరిస్తూ, శానిటైజర్లు వాడాలని సూచించారు. నిర్ణీత పాత లింక్‌ ప్రకారమే ఆటో చార్జీలు వసూలు చేయాలని, అధికంగా వసూలు చేసే ఆటోల పాస్‌లు రద్దు చేస్తామన్నారు.   పర్మిషన్‌ ఇచ్చిన ఆటో డ్రైవర్లు  ఖాకీ యూనిఫామ్‌ ధరించాలన్నారు. ఐడీ కార్డు తప్పనిసరిగా మెడలో ధరించాలని సూచించారు. 

Updated Date - 2021-05-11T05:34:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising