ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించుకోవాలి

ABN, First Publish Date - 2021-04-18T05:04:50+05:30

మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటలను సాగు చేయాలని, రుతుపవనాలు ఆలస్యమైనప్పుడు అవసరమైన ప్రత్యామ్నాయ పంటలు సాగుకు ప్రణాళికను రూపొందించుకోవాలని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌ త్రిమూర్తులు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నంద్యాల, ఏప్రిల్‌ 17: మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటలను సాగు చేయాలని, రుతుపవనాలు ఆలస్యమైనప్పుడు అవసరమైన ప్రత్యామ్నాయ పంటలు సాగుకు ప్రణాళికను రూపొందించుకోవాలని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌ త్రిమూర్తులు అన్నారు. శనివారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో అత్యల్ప వర్షపాత మండల పరిశోధన, విస్తరణ సలహా మండలి (జడ్‌ఆర్‌ఈఏసీ) ముగింపు సమావేశం జరిగింది. ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఏడీఆర్‌ డాక్టర్‌ టి మురళీకృష్ణ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పరిశోధనా విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌ త్రిమూర్తులు మాట్లాడుతూ వ్యవసాయ సీజన్‌లలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా బెట్ట, అధిక వర్షాలప్పుడు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులను రైతులు అప్రమత్తంగా ఉండి పాటించాలని అన్నారు. మార్కెట్‌ ఇంటలిజెంట్స్‌ ద్వారా రైతులు తమ పంటల ప్రణాళికను రూపొందించుకొని వాణిజ్య వ్యవసాయం వైపు అడుగులు వేసి మంచి దిగుబడులు సాధించాలని అన్నారు.  విస్తరణ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ రాంబాబు మాట్లాడుతూ రైతులు తమకు కావాల్సిన వంగడాలను ఉత్పత్తి చేసుకోవాలని అన్నారు. ఇందు కోసం రైతులకు తగిన శిక్షణ  కార్యక్రమాలను నిర్వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు.  


క్షేత్ర స్థాయిలో పరిశోధనా ఫలితాలు :
జడ్‌ఆర్‌ఈఏసీ సమావేశంలో వివిధ కీలకమైన అంశాలపై చర్చించారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు సంయుక్తంగా చర్చించారు.

వేరుశనగ, చిరుధాన్యాలు, నూనెగింజలు, మెట్ట వ్యవసాయం, వ్యవసాయ యాంత్రీకరణ, కలుపు యాజమాన్యం, అధిక దిగుబడిని ఇచ్చే వంగడాల రకాలు, సాగు యాజమాన్య పద్ధతులు, చిన్న, సన్నకారు రైతులు ఉపయోగించుకోగలిగిన వ్యవసాయ పని ముట్లు, యంత్రాల పని తీరుపై పరిశోధన చేసి ఫలితాలను   రైతులకు  తెలియజేయాలని  నిర్ణయించారు.  ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-18T05:04:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising