ఆంధ్రుల రాజధాని అమరావతి
ABN, First Publish Date - 2021-12-16T04:51:44+05:30
ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతి అని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి సోదరుడు బీసీ.రామనాథరెడ్డి, జిల్లా టీడీపీ మైనార్టీ అధ్యక్షుడు జాహీద్‌హుస్సేన తెలిపారు.
రైతుల పాదయాత్రకు మద్దతుగా టీడీపీ సంఘీభావ ర్యాలీ
బనగానపల్లె, డిసెంబరు 15: ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతి అని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి సోదరుడు బీసీ.రామనాథరెడ్డి, జిల్లా టీడీపీ మైనార్టీ అధ్యక్షుడు జాహీద్‌హుస్సేన తెలిపారు. బుధవారం బనగానపల్లెలో టీడీపీ ఆధ్వర్యంలో అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతుగా సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం, దేవస్థానం, మహాపాదయాత్రకు సంఘీభావంగా బనగానపల్లె పట్ణణంలోని టీడీపీ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెట్రోల్‌బంకు కూడలిలో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో మంచాల మద్దిలేటిరెడ్డి, కాట్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, పాతపాడు సర్పంచ మహేశ్వరరెడ్డి, మిట్టపల్లె సర్పంచ తులసిరెడ్డి, నందవరం వెంగన్న, మాజీ సర్పంచలు రామిరెడ్డి, దొనపాటి భాస్కర్‌రెడ్డి, ఉమామహేశ్వరరావు, జహంగీరు, అల్తా్‌పహుస్సేన, సలాం, కలాం, బురానుద్దీన, అహ్మద్‌హుస్సేన, కాసీం, మీరాపురం భాస్కర్‌రెడ్డి, ఆర్‌సీ నాగిరెడ్డి, ఆంజనేయులు, మురళీమోహనరెడ్డి, బొబ్బలగోపాల్‌రెడ్డి, నాగేంద్రరెడ్డి, పుల్లారెడ్డి, టీఎనఆర్‌రెడ్డి, ఖాజాహుస్సేన, యాగంటిపల్లె మహేశ్వరరెడ్డి, దస్తగిరి, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలి
నందికొట్కూరు, డిసెంబరు 15: అమరావతినే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా కొనసాగించాలని టీడీపీ పగిడ్యాల మండల కన్వీనర్ మహేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి రైతులు చేసిన యాత్రకు తమ మద్దతు ఉందని తెలిపారు. ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు పెట్టి రాషా్ట్రన్ని ముక్కలు చేయకుండా అమరామతినే రాజధానిగా కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో భాస్కర్‌రెడ్డి, షకీల్‌అహమ్మద్, జయసూర్య, ముర్తుజావలి, సత్తార్, వహీద్, బాషా, వేణు, కళాకర్, గిరి, కృష్ణారెడ్డి, మద్దిలేటి పాల్గొన్నారు.
Updated Date - 2021-12-16T04:51:44+05:30 IST