ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వైద్యం పేరుతో దోపిడీ’

ABN, First Publish Date - 2021-06-08T16:23:10+05:30

జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ వైద్యశాలలు వైద్యం పేరుతో లక్షలు దోచుకుంటున్నాయని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసులు ఆరోపించారు. నగరంలోని అమీలియో హాస్పిటల్‌ను తక్షణమే సీజ్ చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో హాస్పిటల్ ఎదుట సోమవారం ఆందోళన చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం కోసం అమీలియో హాస్పిటల్‌ను సంప్రదిస్తే కొవిడ్ లక్షణాలు కనిపించకపోయినా వ్యాధి నిర్ధారణ అయినట్లు చూపించి లక్షలాది రూపాయలు దండుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి తప్పకుండా బెడ్ కేటాయించి, మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం చెబుతున్నా నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని అన్నారు. తక్షణమే హాస్పిటల్ గుర్తింపును రద్దు చేసి, అక్రమ బిల్లులు, మరణాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ అధ్యక్షుడు బాబయ్య, ఉపాధ్యక్షుడు చంటి, ఏఐవైఎఫ్ నగర అధ్యక్షుడు శరత్ కుమార్ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-08T16:23:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising