ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ ఉక్కును కాపాడుకుందాం

ABN, First Publish Date - 2021-03-06T05:40:54+05:30

నంద్యాల (ఎడ్యుకేషన్‌), మార్చి 5: విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునే వరకు ఉద్యమాలు ఆగవని వామపక్ష, ప్రజా, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు స్పష్టం చేశారు.

నంద్యాలలోని బస్టాండ్‌ సెంటర్‌లో రోడ్డుపై నిరసన తెలియజేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల (ఎడ్యుకేషన్‌), మార్చి 5: విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునే వరకు ఉద్యమాలు ఆగవని వామపక్ష, ప్రజా, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం చేపట్టిన బంద్‌లో వారు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ సెంటర్‌లో రాస్తారోకో చేపట్టారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చాక బహుళ జాతి కంపెనీలను బడా కార్పొరేట్‌ శక్తులకు కారుచౌకగా అమ్మివేస్తున్నారని ధ్వజమెత్తారు. నిరసన కార్యక్రమాల్లో సీపీఎం తూర్పు జిల్లా కార్యదర్శి రమేష్‌ కుమార్‌, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ పార్టీ నంద్యాల డివిజన్‌ కార్యదర్శి శంకర్‌, సీపీఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగరాజు, మస్తాన్‌, మద్దూరు, శ్రీనివాసులు, రఫీ, చౌడప్ప, ఉరుకుందరావు పాల్గొన్నారు. 


విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను కేంద్రం ఉపసంహరించుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, విద్యార్థి, యువజన సంఘం నాయకులు బంద్‌  నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రుడు, జిల్లా సహాయ కార్యదర్శి షేక్‌ రియాజ్‌, రమణ, రజాక్‌ పాల్గొన్నారు.


నంద్యాలలోని నూనెపల్లెలో ఉన్న జాతీయ రహదారిపై ఏఐఎ్‌ఫబీ, సీపీఐ ఎంఎల్‌ రెడ్‌స్టార్‌ పార్టీ, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ, జాతీయ విద్యార్థి సమాఖ్య, ఏఐఆర్‌ఎ్‌సవో, ఆల్‌ఇండియా స్టూడెంట్స్‌ బ్లాక్‌, డీబీఎ్‌సఎఫ్‌ సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. జాతీయ రహదారిని దిగ్బంధించి రోడ్డుపై బైఠాయించారు.


నంద్యాలలో గిరిజన విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాయక్‌, పీడీఎ్‌సయూ జిల్లా ఉపాధ్యక్షుడు రాంబాబు ఆధ్వర్యంలో బంద్‌  నిర్వహించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరారు. కార్యక్రమంలో పీడీఎ్‌సయూ, జీవీఎస్‌ నాయకులు నితీ్‌షకుమార్‌, దస్తగిరి, రమణ, మనోహర్‌ పాల్గొన్నారు.


 ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని ఏపీఎన్‌జీవో అసోసియేషన్‌ నంద్యాల శాఖ అధ్యక్షుడు మణిశేఖర్‌రెడ్డి, కార్యదర్శి హుసేన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బంద్‌ పిలుపు మేరకు అసోసియేషన్‌ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీనివాసమూర్తి, శివనాగిరెడ్డి, నర్సారెడ్డి, నారాయణరెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-06T05:40:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising