ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దపులుల సంరక్షణ అందరి బాధ్యత

ABN, First Publish Date - 2021-07-30T05:09:49+05:30

నల్లమలలోని పెద్దపులుల సంరక్షణ అందరి బాధ్యతని ఫారెస్టు రేంజర్‌ శ్రీపతినాయుడు అన్నారు.

మాట్లాడుతున్న రేంజర్‌ శ్రీపతినాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. ఫారెస్టు రేంజర్‌ శ్రీపతినాయుడు


రుద్రవరం, జూలై 29: నల్లమలలోని పెద్దపులుల సంరక్షణ అందరి బాధ్యతని ఫారెస్టు రేంజర్‌ శ్రీపతినాయుడు అన్నారు. గురువారం రుద్రవరం ఫారెస్టు రేంజిలోని ఆలమూరు సెక్షన్‌ పరిధిలో మిట్టపల్లె గ్రామంలో ప్రపంచ పెద్దపులుల దినోత్సవాన్ని నిర్వహించారు. ప్లేకార్డులను ప్రదర్శించారు. కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా రేంజర్‌ శ్రీపతినాయుడు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోని పులుల్లో 70 శాతం పులులు భారతదేశంలోనే ఉన్నాయని అన్నారు. దేశంలో ప్రస్తుతం 51 టైగర్‌ రిజర్వు ఫారెస్టులు ఉన్నాయని, పెద్దపులుల సంఖ్య నల్లమలలో పెరిగిందని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్‌ నాగేంద్రనాయక్‌, సెక్షన్‌ ఆఫీసర్లు రాణెమ్మ, కిషోర్‌, నాగరాజు, వెంకటసుబ్బయ్య, బీట్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు. 


‘నల్లమలకే వన్నె తెచ్చిన పెద్దపులి’


శిరివెళ్ల: పెద్దపులుల సంతతి నల్లమలకే వన్నె తెచ్చిందని సబ్‌ డివిజన్‌ ఫారెస్టు ఆఫీసర్‌ మారుతీ ప్రసాద్‌ అన్నారు. మండలంలోని పచ్చర్ల ఎకో టూరిజంలో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. పచ్చర్ల గ్రామ ప్రజలతో కలిసి ర్యాలీ, మానవహారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పులుల ప్రాముఖ్యత, వాటి ఆవాసం, మనుగడ, పరిరక్షణపై ఆయన అవగాహన కల్పించారు. చెలిమ ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ ఈశ్వరయ్య, అటవీ సిబ్బంది, వన సంరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు.  



Updated Date - 2021-07-30T05:09:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising