ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూతన జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలి

ABN, First Publish Date - 2021-06-24T06:06:45+05:30

రెండు వారాల్లో మార్పులు చేసి నూతన జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

నిరుద్యోగులు, విద్యార్థి, యువజన, ప్రజాసంఘాల నాయకులతో రామకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌


    కర్నూలు(న్యూసిటీ), జూన్‌ 23: రెండు వారాల్లో మార్పులు చేసి నూతన జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం నగరంలోని ప్రభుత్వ అతిథిగృహంలో నిరుద్యోగులు, విద్యార్థులు, యువజన, ప్రజాసంఘాల నాయకులతో ముఖాముఖి నిర్వహించారు. కె.రామకృష్ణ మాట్లాడుతూ నూతన జాబ్‌ క్యాలెండర్‌ ప్రటించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. జిల్లాలో ఉద్యోగాలు భర్తీ చేయాలని అడిగిన విద్యార్థి, యువజన సంఘాల నాయకులను అరెస్టు చేయడం సబబు కాదన్నారు. వీరు అనుకుంటే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపుతారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. వెంటనే వారిపై ఉన్న నాన్‌ బెయిలబుల్‌ కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీ, భర్తీపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కొంగర శ్రీనివాసులు, నగర కార్యదర్శి బీసన్న, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి శ్రీరాములు గౌడు, నగర కార్యదర్శి ప్రతాప్‌, రాయలసీమ విద్యార్థి సంఘాల ప్రతినిధులు కోనేటి వెంకటేశ్వర్లు, మోహన్‌, పీడీఎస్‌యూ నాయకులు ఆది, రామక్రిష్ణ, అబ్దుల్లా, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నగేష్‌, హుసేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T06:06:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising