ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

478 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌

ABN, First Publish Date - 2021-01-24T05:59:50+05:30

జిల్లాలో శనివారం 478 మందికి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ వేశామని డీఎంహెచ్‌వో డా.బి.రామ గిడ్డయ్య శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

జొహరాపురంలో టీకా వేయించుకుంటున్న డీఎంహెచ్‌వో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(హాస్పిటల్‌), జనవరి 23: జిల్లాలో శనివారం 478 మందికి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ వేశామని డీఎంహెచ్‌వో డా.బి.రామ గిడ్డయ్య శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 53 సెంటర్లలో 3,536 మందికి వ్యాక్సిన్‌ వేయాల్సింది ఉండగా 474 మందికి వేశామని పేర్కొన్నారు. నగరంలోని జొహరాపురం అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో డీఎంహెచ్‌వో కొవిడ్‌ టీకాను వేయించుకున్నారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 27,358 మందికి టీకాలు వేయాలన్న లక్ష్యం ఉండగా.. 8,623 మందికి వేశామన్నారు. 8వ రోజు కర్నూలు జీజీహెచ్‌, కర్నూలు మెడికల్‌ కాలేజ్‌లో 106 మంది వైద్యులు, సిబ్బంది టీకాలు వేయించుకున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా హెల్త్‌కేర్‌ వర్కర్లకు టీకాలు వేస్తున్నారు. విశ్వభారతి మెడికల్‌ కాలేజ్‌ (పెంచికలపాడు)లో టీకా కేంద్రాన్ని ప్రారంభించారు.


ఐదు కరోనా కేసులు

జిల్లాలో శనివారం 5,216 మందికి పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి కొత్తగా వైరస్‌ సోకింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య 60,770కు చేరింది. ఇందులో 56 యాక్టివ్‌ కేసులు కాగా 60,226 మంది కరోనా నుంచి విముక్తి పొంది డిశ్చార్జి అయ్యారు.

Updated Date - 2021-01-24T05:59:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising