ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘11వ వేతన సవరణను ప్రకటించాలి’

ABN, First Publish Date - 2021-11-29T05:46:03+05:30

పదకొండవ వేతన సవరణను వెంటనే ప్రకటించాలని పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణానిధిమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల(నూనెపల్లె), నవంబరు 28: పదకొండవ వేతన సవరణను వెంటనే ప్రకటించాలని పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణానిధిమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం నంద్యాలలోని రావూస్‌ జూనియర్‌ కళాశాలలో పీఆర్‌టీయూ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా కరుణానిధిమూర్తి హాజరై మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఏడు డీఏలను చెల్లించాలని, సీపీఎ్‌సను వెంటనే రద్దు చేయాలని, బోధనకు అడ్డంకిగా ఉన్న యాప్‌లను తొలగించాలని డిమాండ్‌ చేశారు. మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులకు సర్వీస్‌ రూల్స్‌ చేయాలని, కేజీబీవీ ఉపాధ్యాయినుల సర్వీస్‌ క్రమబద్ధీకరణ చేయాలని అన్నారు. నూతనంగా ఎంపికైన కరుణానిధిమూర్తి, జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణలను సన్మానించారు. కార్యక్రమంలో అబులైస్‌, కృష్ణారావు, విజయరావు, నరసింహులు, హనుమంతు, సుమయోన్‌, జగదీష్‌, వివిధ మండలాల బాధ్యులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-11-29T05:46:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising