ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలు జిల్లా: కలుషిత నీరు తాగి నలుగురి మృతి

ABN, First Publish Date - 2021-04-07T21:22:48+05:30

కర్నూలు: జిల్లాలో కలుషిత నీరు తాగి నలుగురు మృతి చెందారు. మరో వందమందికిపైగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలో కలుషిత నీరు తాగి నలుగురు మృతి చెందారు. మరో వందమందికిపైగా ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కలుషిత నీరు తాగి గ్రామస్తులు చనిపోతుండడంతో గోరుకల్లు వాసులు ఊరు విడిచి ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. 


పాణ్యం మండలంలో గోరుకల్లులో మూడు రోజుల నుంచి కలుషిత నీరుతాగి 30 మందికిపైగా అస్వస్థతకులోనయ్యారు. వారిలో కిట్టు, హుస్సేన్, మద్దమ్మ చనిపోయారు. మరికొందరు అస్వస్థతకు గురై అస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. గోరుకల్లును నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనకుమారి, డీఎంహెచ్‌వోతోపాటు మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సందర్శించారు. కొత్త డ్రైన్, పైపులైన్లు వేసేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల మురుగునీరు.. తాగునీటిలో కలిసి కలుషితమైందని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని గౌరు చరితారెడ్డి అన్నారు.

Updated Date - 2021-04-07T21:22:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising