ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుప్పం, జగ్గయ్యపేట, నెల్లూరులో గెలిచి ఓడాం: దేవినేని ఉమ

ABN, First Publish Date - 2021-11-24T21:25:42+05:30

కుప్పం, జగ్గయ్యపేట, నెల్లూరులో గెలిచి ఓడామని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కుప్పం, జగ్గయ్యపేట, నెల్లూరులో గెలిచి ఓడామని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ కౌన్సిలర్లకు కోటి ఇస్తామని ప్రలోభ పెట్టారని ఆరోపించారు. వారి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చి బెదిరించారని తెలిపారు. కొన్ని చోట్ల అధికారులు ఫలితాలు తారుమారు చేశారని, రీ పోలింగ్, రీ కౌంటింగ్ కోసం కోర్టుకెళ్తామని దేవినేని ఉమ తెలిపారు. 


కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ భరితంగా జరిగింది. ఎన్నిక ప్రక్రియను మరోసారి వాయిదా వేయించేందుకు వైసీపీ సభ్యులు కొత్త ఎత్తుగడ వేశారు. ఫలితం వెంటనే ప్రకటించ వద్దని హైకోర్టు చెప్పిన కారణాన్ని చూపుతూ కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారు. ఎట్టకేలకు కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక పూర్తయ్యింది. ఛైర్మన్‌గా టీడీపీ సభ్యుడు చెన్నుబోయిన చిట్టిబాబును ఆ పార్టీ సభ్యులు బలపరిచారు. దీంతో ఆయన ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఎంపీ కేశినేని నాని ఓటుతో టీడీపీకి మెజారిటీ వచ్చింది. వైస్ ఛైర్మన్‌గా చుట్టుకుదురు శ్రీనివాసరావు, మరో వైస్ ఛైర్మన్‌గా కరిపికొండ శ్రీలక్ష్మీకి టీడీపీ సభ్యులు ఆమోదం తెలిపారు. అయితే హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల అధికారులు ఫలితాలను ప్రకటించలేదు.


Updated Date - 2021-11-24T21:25:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising