ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఎన్జీటీకి కేఆర్‌ఎంబీ నివేదిక

ABN, First Publish Date - 2021-08-15T02:04:16+05:30

రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు కేఆర్‌ఎంబీ ధృవీకరించింది. రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఎన్జీటీకి కేఆర్‌ఎంబీ నివేదిక సమర్పించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు కేఆర్‌ఎంబీ ధృవీకరించింది. రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఎన్జీటీకి కేఆర్‌ఎంబీ నివేదిక సమర్పించింది. డీపీఆర్‌కు అవసరమైన పనులకన్నా అధికంగా పనులు జరిగినట్లు కేఆర్‌ఎంబీ నివేదికలో నిర్ధారించింది. ఎన్జీటీ తీర్పును ధిక్కరించినట్లు కేఆర్‌ఎంబీ ధృవీకరించింది. పంప్ హౌస్, అప్రోచ్ ఛానల్, ఫోర్ బే, డెలివరీ మెయిన్ ఛానల్, డెలివరీ సిస్టమ్, లింక్ కెనాల్ పనులు జరిగినట్లు నిర్ధారించినట్లు కేఆర్‌ఎంబీ పేర్కొంది. రెండ్రోజులపాటు ప్రాజెక్ట్ పనులను కేఆర్‌ఎంబీ అధికారులు తనిఖీ చేశారు. ప్రాజెక్ట్‌లో ముఖ్యమైన పనులను పూర్తిచేసినట్లు కేఆర్‌ఎంబీ పేర్కొంది. ఫోటోలతో సహా సమగ్ర నివేదికను ఎన్జీటీకి సమర్పించినట్లు కేఆర్‌ఎంబీ స్పష్టం చేసింది. ఎన్జీటీ సోమవారం విచారణ జరపనుంది. కోర్టు తీర్పు ధిక్కరణకు పాల్పడితే సీఎస్‌ను జైలుకు పంపుతామని గతంలో ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated Date - 2021-08-15T02:04:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising