ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు రైతుల ఖాతాల్లోకి YSR రైతు భరోసా..

ABN, First Publish Date - 2021-10-26T13:46:02+05:30

వైఎస్సార్‌ రైతు భరోసా- పీఎం కిసాన్‌ రెండో విడత కార్యక్రమాన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : వైఎస్సార్‌ రైతు భరోసా- పీఎం కిసాన్‌ రెండో విడత నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విడుదల చేయనున్నారు. దీంతో పాటు సున్నావడ్డీ పంట రుణాల రీయింబర్స్‌మెంట్‌, వైఎస్సార్‌ యంత్రసేవా పథకం లబ్ధిదారులకు డీబీటీ పద్ధతిలో మంగళవారం నాడు నగదు జమచేయనున్నారు. ఈ మూడు పథకాలకు జగన్.. మీట నొక్కి నిధులు విడుదల చేస్తారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించనున్న కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొంటారు. 


ఈ ఏడాది రైతు భరోసా పథకంలో రెండో విడతగా 50.37 లక్షల మందికి రూ.2,052 కోట్లు, 2020 ఖరీ‌ఫ్‌లో రూ.లక్షలోపు రుణం తీసుకుని, వడ్డీతో సహా ఏడాదిలో చెల్లించిన 6.67 లక్షల మంది రైతులకు సున్నావడ్డీ కింద రూ.112.7 కోట్లు మంజూరు చేయనున్నారు. అదేవిధంగా యంత్రసేవా పథకం కింద 1,720 రైతు గ్రూపులకు రూ.25.55 కోట్లు జమ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా.. అర్హులెవరూ మిగిలిపోకూడదని, అనర్హులకు అందకూడదని జగన్ ఇదివరకే స్పష్టం చేశారు.

Updated Date - 2021-10-26T13:46:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising