ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నున్న మోడల్‌ లే అవుట్‌లో బోర్ల ఏర్పాటు

ABN, First Publish Date - 2021-05-06T06:23:22+05:30

నున్న మోడల్‌ లే అవుట్‌లో బోర్ల ఏర్పాటు

ముమ్మరంగా బోర్ల నిర్మాణ పనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ రూరల్‌, మే 5 : పేదలకు నివేన స్థలాలు పంపిణీలో జిల్లాలోనే మోడల్‌గా తీర్చిదిద్దిన  నున్న లే అవుట్‌లో రూ.1.44 కోట్లతో నీటి సౌకర్యం కల్పిస్తున్నారు. పేదలకు పంపిణీ చేసిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణంతోపాటు తాగునీటి సౌకర్యం కోసం యుద్ధ ప్రాతిపదికన బోర్లను ఏర్పాటు చేస్తున్నారు. నున్న మోడల్‌ లే అవుట్‌లో ఆరు బోర్లు, పైపులైను నిర్మాణం, 40 వేల సామర్థ్యం కలిగిన రెండు ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల నిర్మాణం కోసం ఆర్‌డబ్ల్యూఎస్‌ నుంచి రూ.1.44 కోట్లు విడుదలయ్యాయి. దీంతో రెండు రోజులుగా  బోర్ల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నున్న మోడల్‌ లే అవుట్‌లో విజయవాడ రూరల్‌ మండలంలోని ఏడు గ్రామాలతోపాటు విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలోని సుమారు పది వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. మరో 200 ఎకరాలలో కూడా భూ సేకరణ చేసి స్థలాలను పంపిణీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది.   నున్నలోని మరో లే అవుట్‌లో తాగునీటి సౌకర్యం కోసం రూ.27 లక్షలు, జక్కంపూడి లే అవుట్‌కు రూ.9 లక్షలు, కొత్తూరు తాడేపల్లి లే అవుట్‌కు రూ.18 లక్షలు మంజూరైనట్లు ఏఈఈ నాంచారయ్య తెలిపారు. 

Updated Date - 2021-05-06T06:23:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising