ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యమం ఉధృతం చేస్తాం

ABN, First Publish Date - 2021-08-03T06:53:37+05:30

వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధ్రుతం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఐటీయూ రాష్ట్ర నేత ఉమామహేశ్వరరావు హెచ్చరిక

మూడురోజుల ధర్నా ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన వీఆర్‌ఏలు 

విజయవాడ సిటీ, ఆగస్టు 2: వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధ్రుతం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏపీ గ్రామరెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ధర్నా స్థానిక ధర్నాచౌక్‌లో సోమవారం జరిగింది. 3రోజుల పాటు జరిగే ధర్నా కార్యక్రమాన్ని వి.ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వీఆర్‌ఏలకు ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీని ఇప్పటి వరకు సీఎం జగన్‌ అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. గత ప్ర భుత్వం పెట్టిన ప్రతిపాదనలకు అడ్డంకిగా ఉన్న న్యా యపరమైన ఇబ్బందులను అధిగమించి నామినీలకు న్యాయం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విజయవాడకు పెద్ద సంఖ్యలో వీఆర్‌ఏలు తరలివచ్చారు. రూ.21 వేల కనీస వేతనం చెల్లించాలని, నామినీలను వీఆర్‌ఏలుగా నియమించాలని, గత ప్రభుత్వం ఇచ్చిన డీఏలను అమలు చేయాలని, అర్హులకు ప్రమోషన్స్‌ ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీరుగంటి పెద్దన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వై.శ్రీనివాసులు, సంఘం ప్రధానకార్యదర్శి ఎం.బాలకాశి, కాం ట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌  జేఏసీ రాష్ట్ర కార్యదర్శి నూర్‌ మహమ్మద్‌, యూనియన్‌ నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-03T06:53:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising